దత్తత గ్రామంలో పర్యటించనున్న సీఎం చంద్రబాబు
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తాను దత్తత తీసుకున్న గ్రామంలో పర్యటనలో భాగంగా పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేయనున్నారు. అనంతరం దీపం పథకం లబ్ధిదారులకు చంద్రబాబు గ్యాస్ కలెక్షన్లు అందజేయనున్నారు. అక్కడ నుంచి నేరుగా తద్తత గ్రామం పెద్దబయలు చేరుకుని ప్రజలతో మాట్లాడి వారి సమస్యలను అడిగి తెలుసుకుంటారు. స్మార్ విలేజ్ కార్యక్రమంలో భాగంగా చంద్రబాబు విశాఖ జిల్లాలోని అరకు మండలం పెదబయలు పంచాయతీని దత్తత తీసుకున్న విషయం తెలిసిందే. పర్యటన అనంతరం సాయంత్రం 6 గంటలకు అమరావతికి తిరుగు పయనమవుతారని సమాచారం.








