ఈ నెల 9న బెంగళూరుకు సీఎం చంద్రబాబు
కర్ణాటకలో నివసించే తెలుగు ప్రముఖుల వివరాలతో రూపొందించిన డైరెక్టరీ విడుదల కార్యక్రమంలో పాల్గొనేందుకు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఈ నెల 9న బెంగళూరు రానున్నారని డైరెక్టరీ రూపకర్త నాగేశ్వరరావు వెల్లడించారు. ఐఏఎస్, ఐపీఎస్, ఐఎఫ్ఎస్, ఐఆర్ఎస్ అధికారులతోపాటు విద్యాసంస్థల ప్రముఖులు, వివిధ కంపెనీల చైర్మన్లు, బ్యాంకు ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ సాయి అధికారులు 300 మంది వివరాలను అందులో పొందుపరిచామన్నారు.








