పెట్టుబడుల గమ్యస్థానంగా ఆంధ్రప్రదేశ్
ప్రపంచ పెట్టుబడుల గమ్యస్థానంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నిలవాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు అన్నారు. నవ నిర్మాణ దీక్ష 5వ రోజు సందర్భంగా ఆయన టెలికాన్ఫరెన్స్ లో అధికారులు, ప్రజాప్రతినిధులతో మాట్లాడారు. సకాలంలో వర్షాలు పడుతుండటం శుభ సూచకమని ఆయన అన్నారు. ప్రభుత్వ కృషికి ప్రకృతి సహకారం తోడైతే అద్భుత ప్రగతి సాధ్యమౌతుందని అన్నారు. ఇస్రో విజయాలు, సివిల్స్ విద్యార్థుల విజయాలు స్పూర్తిదాయకమని పేర్కొన్నారు.








