పనులూ చేస్తే ప్రతిపక్షం అవసరం లేదు : చంద్రబాబు
రాష్ట్రంలో ప్రజల అవసరాలకు తగినట్టుగా అన్ని పనులూ చేస్తే ప్రతిపక్షం ఉండాల్సిన అవసరమే లేదని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు. టీడీపీ ఆవిర్భవించి 35 ఏళ్ల గడచిన సందర్భంగా గుంటూరులోని పార్టీ రాష్ట్ర కార్యాలయంలో నిర్వహించిన ఉత్సవంలో చంద్రబాబు మాట్లాడారు. తెలుగుదేశం పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా కార్యక్తలంతా మహా సంకల్పానికి దీక్షబూనాలని పిలుపునిచ్చారు. భవిష్యత్తులో 80శాతం ప్రజలు, రాజకీయ నాయకులు, కార్యకర్తలు తెలుగుదేశం పార్టీలోనే ఉండాలని ఆశాభావం వ్యక్తం చేశారు. లోటు బడ్జెట్లోనూ రూ.24వేల కోట్ల మేరకు రుణ మాఫీ చేశామని, డ్వాక్రా మహిళలకు రూ.10వేల కోట్లు ఇచ్చామని పేర్కొన్నారు. కార్యకర్తలంతా మీమీ గ్రామాల్లో 80 శాతం ఓట్లు మనకే పడేలా కృషి చేయాలి. వేరే పార్టీకి ఓట్లు పడితే కార్యకర్తలు అసమర్థులై ఉండాలేగానీ, ప్రభుత్వం లోపం కాదు అని తేల్చిచెప్పారు. రాష్ట్రంలో రూ.లక్షన్నర మేరకు రైతు రుణాలను మాపీ చేశామని పేర్కొన్నారు. ఈ ఏడాది పులివెందులకు ఇచ్చినట్టే వచ్చే ఏడాది మడకశిర చిత్తూరు, కుప్పం వంటి ప్రాంతాలకూ సాగునీరు ఇస్తాన్నారు.







