దేశంలో నేనే సీనియర్ని.. నిన్నగాక మొన్నొచ్చిన రాహుల్‌కి భయపడటమా?: బాబు
దేశ రాజకీయాల్లో తానే సీనియర్ నేతను అని, ఎవరికీ భయపడేది లేదని ఏపీ సీఎం చంద్రబాబు అన్నారు. ప్రత్యేక హోదా గురించి గుంటూరులో సభ అయితే పెట్టగలిగారు గానీ హోదాలో ఏముందో మాత్రం స్పష్టంగా చెప్పలేకపోయారని కాంగ్రెస్ నేతలను ఉద్దేశించి చంద్రబాబు అన్నారు. నిన్న గాక మొన్నొచ్చిన రాహుల్ గాంధీని చూసి తన భయపడమేంటని ప్రశ్నించారు. తానెవరికీ భయపడే వ్యక్తిని కాదని స్పష్టం చేశారు.








