రిటైరయితే నాకు తిండి పెట్టేది వారే కదా
పిల్లల్ని చదివించాల్సిన బాధ్యత తల్లిదండ్రులపై ఉందని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. సాధారణంగా రాజకీయ నాయకుల పిల్లలు సరిగా చదువుకోరు.. కానీ మేం అలా భావించలేదని ఆయన అన్నారు.ఉన్నత విద్యను అందించాలనే లక్ష్యంతో లోకేశ్‌ను స్టాన్‌ఫోర్డ్‌లో చదివించాం అని సీఎం వివరించారు. మా ఇంట్లో నలుగురూ విద్యావంతులేనని నేను రిటైర్డ్ అయ్యాక వారే నాకు తిండి పెడతారని సీఎం సరదాగా అన్నారు.








