అమరావతి ఆంధ్రప్రదేశ్‌కు ఆత్మగౌరం : చంద్రబాబు
అమరావతి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఆత్మగౌరవం అని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు. పోలరవం ప్రాజెక్టుల పనుల పురోగతిపై ఎమ్మెల్మేలు, ఎమ్మెల్సీలకు శాసనసభ కమిటీ హాల్లో వీడియో ప్రజంటేషన్ ద్వారా అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి పోలవరం, అమరావతి రెండు ప్రతిష్టాత్మక ప్రాజెక్టులు అని అన్నారు. పోలవరం ఆంధ్రప్రదేశ్‌కు జీవనాడి అని పేర్కొన్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో పోలవరం ప్రాజెక్టు పూర్తి చేయడం చాలా అవసరమని పేర్కొన్నారు. ప్రాజెక్టుకు నాబార్డ్ ద్వారా ఆర్థిక సహకారం అందుతుందని చెప్పారు. ఏటా 3వేల టీఎంసీల నీరు సముద్రం పాలవుతోందని అన్నారు. పోలవరం పూర్తయితే కృష్ణా బేసిన్‌లోని ప్రాజెక్టులకు నీళ్లిచ్చే వెసులుబాటు వస్తుందని తెలిపారు. రికార్డు సమయంలో ప్రాజెక్టును పూర్తిచేస్తామని అన్నారు. 2018 నాటికి పోలవరం నుంచి గ్రావిటీతో నీళ్లిస్తామని అన్నారు.













