సీఎం చంద్రబాబు వినాయక చవితి శుభాకాంక్షలు
వినాయకుడు ప్రకృతికి ప్రతీకగా నిలిచే ఆరాధ్యదైవం అని గణేశ్ పూజలకు మట్టి ప్రతిమలనే ఉపయోగించాలని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పిలుపునిచ్చారు. రాష్ట్ర ప్రజలకు, దేశ, విదేశాల్లోని తెలుగువారికి ఆయన వినాయక చవితి శుభాకాంక్షలు తెలిపారు. రాష్ట్ర పురోభివృద్ధికి విఘ్నాలన్నీ తొలగిపోవాలని ఆకాంక్షిస్తున్నట్లు ముఖ్యమంత్రి చెప్పారు. ప్రజలందరికీ గణనాయకుని ఆశీస్సులు లభించాలని, అందరూ సుఖసంతోషాలతో జీవించాలని కోరుకుంటున్నట్లు చంద్రబాబు తెలిపారు.








