‘మన అమరావతి’ యాప్ను ఆవిష్కరించిన చంద్రబాబు
మన అమరావతి యాప్ను ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆవిష్కరించారు. సీఆర్డీఏపై మ్యుమంత్రి చంద్రబాబు సంబంధిత అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మన అమరావతి యాప్ను సీఎం చంద్రబాబు ఆవిష్కరించారు. ఈ యాప్లో 29గ్రామాల సమాచారంతో పాటు పౌర సేవలను అజ్నా నెట్వర్క్ సంస్థ పొందుపరిచింది. అంతేగాకుండా దళారుల ప్రవేయం లేకుండా ప్లాట్ల కొనుగోలు, అమ్మకాలను ఈ యాప్ ఉపయోగపడనుంది. ఈ యాప్ను సీఆర్డీఏ అనుసంధానం చేశారు. కాగా మన అమరావతి యాప్ డెవలపర్లను ముఖ్యమంత్రి చంద్రబాబు అభినందించారు.













