పెళ్లి రోజునే చంద్రన్న కానుక
పేద మహిళలకు చంద్రన్న పెళ్లి కానుకపై కలెక్టర్ల సదస్సులో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సృష్టతనిచ్చారు. బీసీలకు రూ.30వేలు, ఎస్సీలకు 35వేలు, ఎస్టీ, ముస్లిం మహిళలకు రూ.50వేలు చొప్పున పెళ్లి కానుక ఇవ్వనున్నట్లు ప్రకటించారు. ఈ మొత్తాలను పెళ్లి రోజునే చెక్ రూపంలో అందజేసేలా కార్యచరణ రూపొందించాలని అధికారులను ఆదేశించారు. సంక్షేమ కార్యక్రమాలపై నిర్వహించిన సమీక్ష సమావేశలో ముఖ్యమంత్రి అనేక విషయలను ప్రస్తావించారు. పారదర్శకంగా చంద్రన్న పెళ్లికానుక, ఆదరణ, చంద్రన్న బీమా అమలుచేయాలని దిశానిర్దేశం చేశారు.








