ముగిసిన ఏపీ కేబినెట్ భేటీ
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రివర్గ సమావేశం ముగిసింది. సమావేశానంతరం మంత్రివర్గ నిర్ణాయాలను కేబినెట్ మీడియాకు వెల్లడించింది. విజయవాడ మెట్రోకు రుణ పరిమితి పెంపు రూ.2,175 కోట్ల వరకు హడ్కో రుణం తీసుకునేందుకు కేబినెట్ ఆమోదం తెలిపింది. విశాఖ జిల్లా అచ్చుతాపురంలో 2500 ఎకరాల్లో బాబా అటామిక్ రిసెర్చ్ సెంటర్, సెజ్ ఏర్పాటుకు కేబినెట్ గ్రీన్ సిగ్నలిచ్చింది. రేషన్ షాపుల్లో చక్కెర తొలగింపు, షాపుల మనుగడపై చర్చించారు. రేషన్ షాపుల మనుగడకు ప్రత్యామ్నాయాలు ఆలోచించాలని నిర్ణయం తీసుకున్నారు. సాగునీటి సంఘాలకు ఐదేళ్లకోసారి ఎన్నికలు నిర్వహించాలని, చేతులు ఎత్తే పద్ధతిలో ఎన్నికలు నిర్వహించాలని కేబినెట్ నిర్ణయం తీసుకుంది. అగ్రిగోల్డ్ ఆస్తుల వేలంపై, ప్రభుత్వ రేషనలైజ్పై కేబినెట్లో చర్చించారు. 10 మంది విద్యార్థుల లోపు ఉన్న స్కూళ్లను విలీనం చేయాలని, నవ నిర్మాణ దీక్షను సీరియస్గా తీసుకోవాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. మంత్రులు ఇన్చార్జ్గా ఉన్న జిల్లాలో దీక్షలో పాల్గొనాలని ముఖ్యమంత్రి సూచించారు. రైతులకు 230 కోట్ల ఇన్పుట్ సబ్సిడీ ఇచ్చేందుకు కేబినెట్ ఆమోదం తెలిపింది.








