విశాఖలో 700 కోట్లతో కన్వెన్షన్ సెంటర్ నిర్మాణానికి కేబినెట్ అనుమతి
విశాఖలో రూ. 700 కోట్ల పెట్టుబడితో కన్వెన్షన్ సెంటర్ నిర్మాణానికి లులు గ్రూప్‌కి కేబినెట్ అనుమతి ఇచ్చింది. రూ.200 కోట్లు విలువైన 9 ఎకరాల ఏపీఐఐసీ భూమిని 33 ఏళ్ల లీజు కింద లులు గ్రూప్ అప్పగించాలని కేబినెట్ నిర్ణయం తీసుకుంది.
ఏటా రూ.4.20 కోట్ల లీజు, ఏడాదికి ఐదు శాతం పెంచనున్నారు. సంవత్సరంలోగా నిర్మాణం చేపట్టాలని లులు గ్రూప్ కు కేబినెట్ సూచించింది. మిడిల్ ఈస్టులో లులు గ్రూప్‌కు మంచి పేరు ఉంది. బీసీ రెసిడెన్షియల్ పాఠశాలలకు 200 పోస్టులు మంజూరు చేశారు.








