నవంబరులోనే ఏపీ బడ్జెట్
ఆంధ్రప్రదేశ్ వార్షిక బడ్జెట్‌ను నవంబరులో ప్రవేశపెట్టడానికి ప్రభుత్వం సిద్ధమవుతోంది. జనవరి-డిసెంబరు మధ్య కాలాన్ని ఆర్థిక సంవత్సరంగా పరిగణించాలని కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం అమలైతే రాష్ట్ర బడ్జెట్ ను డిసెంబర్‌లోపు ప్రవేశపెట్టాల్సి వస్తుంది. ఈ నేపథ్యంలో బడ్జెట్‌ను నవంబరులో ప్రవేశపెట్టడానికి మానసింగా సిద్ధం కావాలని ఆర్థికశాఖ అధికారులకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సూచించారు. దీనికి సంబంధించి ఇప్పటి నుంచే కసరత్తు చేపట్టాలని ఆదేశించారు. ఏప్రిల్ నుంచి డిసెంబరు 31 వరకు ఉన్న కాలాన్ని ఈ ఏడాది పరిణామకాల ఆర్థిక సంవత్సరంగా (ట్రాన్సిషనల్ ఫైనాన్షియల్ ఇయర్) పరిగణించాలని సూచించారు. ఆర్థిక, ఆదాయార్జన విభాగాలపై వెలగపూడి సచివాలయంలో ముఖ్యమంత్రి సమీక్ష జరిపారు.








