రాష్ట్రంలో పాలన సరైన వ్యక్తి చేతిలోనే : కేంద్ర మంత్రి
రాష్ట్రంలో పాలన సరైన వ్యక్తి చేతిలోనే ఉందని, రాష్ట్రాభివృద్ధికి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు బాగా కష్టపడుతున్నారని కేంద్ర ఆరోగ్య శాఖ సహాయ మంత్రి అనుప్రియా పటేల్ ప్రశంసించారు. రాష్ట్రంలో రియల్‌టైం గవర్నెన్స్ బాగుందన్నారు. వెలగపూడి సచివాలయంలో ముఖ్యమంత్రితో భేటీ అయ్యారు. భేటీకి ముందు ఆమె నూతనంగా నిర్మించిన అసెంబ్లీ, మండలి, సచివాలయం భవనాలను పరిశీలించారు. సుందరంగా నిర్మించారని కితాబిచ్చారు.








