ఆంధ్రప్రదేశ్ కు మరో భారీ పరిశ్రమ
ఆంధ్రప్రదేశ్‌కు మరో భారీ పరిశ్రమ రాబోతోంది. నెల్లూరు జిల్లా దగదర్తి వద్ద కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో రూ.3 వేల కోట్లతో అల్యూమినియం ఫెర్రో అల్లాయిస్ పరిశ్రమను నెలకొల్పడానికి రంగం సిద్ధమైంది. కేంద్ర ప్రభుత్వ ప్రతిపాదనలో ఉన్న ఈ భారీ ప్రాజెక్టును నెల్లూరులో ఏర్పాటు చేసేందుకు ఆర్థిక, రక్షణశాఖల మంత్రి అరుణ్‌జైట్లీ, గనుల శాఖ మంత్రి పీయూష్ గోయల్ సానుకూలంగా స్పందించారు. ఈ పరిశ్రమ కోసం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇప్పటికే 110 ఎకరాల భూమిని కేటాయించింది. హైదరాబాద్ కేంద్రంగా కార్యకలాపాలు నిర్వహిస్తున్న రక్షణ రంగ సంస్థ మిశ్రధాతు నిగం (మిధాని), నేషనల్ అల్యూమినియం కంపెనీ (నాల్కో) సంయుక్త భాగస్వామ్యంలో ఈ పరిశ్రమ ఏర్పాటు కానుంది.








