సీఎం చంద్రబాబును కలిసిన బ్రిటిష్ హైకమిషనర్
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడును సచివాలయంలోని ఆయన కార్యాలయంలో బ్రిటీష్ డిప్యూటీ హై కమిషనర్ ఆండ్రు ఫ్లెమింగ్ మర్యాదపూర్వకంగా కలిశారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అమరావతిలో చేపట్టిన వివిధ కార్యక్రమాలను ఆయనకు వివరించారు. అనంతరం బ్రిటీష్ డిప్యూటీ కమిషనర్ ఆండ్రు ఫ్లెమింగ్‌కు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు శాలువా కప్పి, జ్ఞాపికను బహుకరించారు.








