నవంబర్లోనే ఏపీ బడ్జెట్
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వార్షిక బడ్జెట్‌ను నవంబరు నెలాఖరులో ప్రవేశపెట్టనున్నారు. ఈ దిశగా సిద్ధంగా ఉండాలని ప్రభుత్వం నుంచి ఆర్థిక శాఖకు సూచనలందాయి. దీంతో ఆర్థిక శాఖ అప్పుడే బడ్జెట్‌కు సంబంధించిన సన్నాహక కసరత్తుల్లో నిమగ్నమైంది. ఆర్థిక సంవత్సరాన్ని జనవరి నుంచి డిసెంబర్ మధ్య కాలాన్నే పరిగణించాలని కేంద్ర నిర్ణయించింది. ఈ మేరకు కేంద్రం కూడా డిసెంబరులో బడ్జెట్‌ను ప్రవేశపెట్టనుంది. రాష్ట్ర ప్రభుత్వం కూడా కేంద్రం నిర్ణయం ప్రకారం బడ్జెట్‌ను నవంబరులో ప్రవేశపెట్టాలని ఇప్పటికే నిర్ణయించుకుంది.








