మహర్నవమి స్త్రీశక్తి విజయానికి సంకేతం : చంద్రబాబు
మహార్నవమి మహిళా శక్తి విజయానికి సంకేతమని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. రాష్ట్ర ప్రజలకు, దేశ విదేశాల్లోని తెలుగువారికి మహార్నవమి శుభాకాంక్షతుల తెలిపారు. మహిళలను గౌరవించడంతోపాటు వారికి సాధికారత కల్పించిన ఘనత తమ ప్రభుత్వానిదేనన్నారు. దేవీ నవరాత్రి ఉత్సవాల్లో మహర్నవమి నాడు అమ్మవారు లోకకంటకుడైన మహిషాసురుణ్ణి వధించి మహిషాసురమర్థినిగా, జగజ్జననిగా అవతరించినట్లు పేర్కొన్నారు. ఎన్టీఆర్ దేశంలో తొలిసారిగా మహిళలకు ఆస్తిహక్కు కల్పించారని, ప్రత్యేక మహిళా విశ్వవిద్యాలయం స్థాపించారని చెప్పారు. తమ హయాంలో స్త్రీలకు స్థానిక సంస్థల్లో రిజర్వేషన్లు, ఉద్యోగాల్లో ప్రత్యేక కోటా ప్రవేశపెట్టామన్నారు.








