అమరావతిలో మరో ప్రతిష్ఠాత్మక ప్రాజెక్టుకు భూమిపూజ
నవ్యాంధ్ర రాజధాని అమరావతిలో మరో ప్రతిష్ఠాత్మక ప్రాజెక్టుకు భూమిపూజ జరిగింది. గుంటూరు జిల్లా మంగళగిరి మండలం యర్రబాలెంలో ఇండో-యూకే ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న హెల్త్ సిటీకి ఆ సంస్థ సీఈవో అజయ్ రాజన్ గుప్తా కుటుంబసభ్యులతో కలిసి భూమిపూజ చేశారు. మూడుదశల్లో 150 ఎకరాల్లో నిర్మించే ఆస్పత్రి నిర్మాణానికి మొత్తం రూ.1700 కోట్ల పెట్టుబడి పెట్టనున్నారు. మొదటి దశలో రూ.500 కోట్ల వ్యయంతో 50 ఎకరాల్లో అత్యాధునిక ఆస్పత్రి నిర్మించున్నారు. 2019లోపు తొలిదశ నిర్మాణాలు పూర్తిచేస్తారు. నిర్మాణానికి కాల్సిన మౌలిక వసతులను సీఆర్డీఏ అధికారులు సమకూర్చుతారు. తొలిదశలో 250 పడలక ఆస్పత్రి నిర్మాణం చేయనున్నారు. ఇందులో 20 శాతం భూముల్చిన రైతులు, స్థానికులకు ఉచితంగా వైద్యం అందించనున్నారు. 2022లోపు మూడు దశల్లో ఆస్పత్రి నిర్మాణం పూర్తికానుంది.
ఏపీలో వైద్య రంగానికి అధిక ప్రాధాన్యం : చంద్రబాబు
ఆంధ్రప్రదేశ్ లో ఎక్కడా లేని విధంగా వైద్యానికి అధిక ప్రాధాన్యత ఇస్తున్నాం అని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు. గుంటూరు జిల్లా మంగళగిరి మండలం ఎర్రపాలెం వద్ద రూ.వెయ్యి కోట్ల వ్యయంతో 150 ఎకరాల్లో నిర్మించనున్న హెల్త్ మెడిసిటీకి ఈరోజు ఆయన శంకుస్థాపన చేశారు. విజయవాడలో జరిగిన కార్యక్రమంలో రిమోట్ కంట్రోల్ ద్వారా చంద్రబాబు శిలాఫలకాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రానున్న రోజుల్లో అమరావతి వైద్య పర్యాటక హబ్‌గా మారబోతోందని పేర్కొన్నారు. రాష్ట్రానికి భారీస్థాయిలో పెట్టుబడులు రానున్నాయి. దాదాపు 20 మెడికల్ కాలేజీలు రాబోతున్నాయి. వీటికి సంబంధించి ఇప్పటికే ఒప్పందాలు జరిగాయి. ఉద్యోగులు, జర్నలిస్టులకు, హెల్త్‌కార్డులు ఇచ్చాం. సంచార వైద్యం కింద 200 కి పైగా వాహనాలు ఏర్పాటు చేశాం. తల్లీబిడ్డ ఎక్స్‌ప్రెస్, ఎన్టీఆర్ బేబీ కిట్ వంటి కార్యక్రమాలు చేపట్టాం అని తెలిపారు.








