సీఎం చంద్రబాబుకు అనంత ప్రజాప్రతినిధుల అభినందనలు
అనంతపురం జిల్లాలో ఏర్పాటు చేయబోయే కియా మోటార్స్ కార్ల కంపెనీలో 90శాతం ఉద్యోగాలు స్థానికులకే ఇచ్చేలా చూస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తెలిపారు. అనంతపురం జిల్లాలో ఈ సంస్థ ఏర్పాటయ్యేలా చర్యలు తీసుకున్న ముఖ్యమంత్రి చంద్రబాబుకు ఆ జిల్లాకు చెందిన ప్రజాప్రతినిధులు సచివాలయంలో కలిసి అభినందనలు తెలిపారు. ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ ఈ పరిశ్రమ రాకతో కరవు జిల్లా అనంతపురం రూపురేఖలే మారిపోతాయన్నారు. వాహన రంగంలో అతి పెద్దదైన కియా కంపెనీ రాష్ట్రానికి రావడం చరిత్రాత్మక అంశమన్నారు. రూ.13వేల కోట్ల పెట్టుబడితో ఏర్పాటు చేసే ఈ పరిశ్రమ 11 వేల మందికి ఉద్యోగాలు కల్పించనుందని, స్థానికులకే తొలి ప్రాధాన్యం ఇచ్చేలా చర్చలు తీసుకుంటానని తెలిపారు. భవిష్యత్తులో అనంతపురం పరిశ్రమలకు కేంద్రంగా మారుతుందని తెలిపారు. పెనుకొండ ఎమ్మెల్యేల బీకే పార్థసారధి నేతృత్వంలో ఎంపీటీసీటీలు, జడ్పీటీసీలు, ఎంపీపీలు ఇతర ప్రజాప్రతినిధులు చంద్రబాబును ఘనంగా సత్కరించారు.








