తిరుపతి ప్రసాదాలకు అనకాపల్లి బెల్లం
తిరుమల శ్రీవారి ప్రసాదాల తయారీలో అనకాపల్లి బెల్లం వినియోగించనున్నారు. స్వామివారి ప్రసాదంలో ఈ బెల్లం వినియోగించాలని ఇక్కడి వ్యాపారులు టీటీడీని ఎప్పటినుంచో కోరుతున్నారు. ఇదే అంశంపై ఈ ఏడాది ఆరంభంలోనే టీటీడీ అధికారులు అనకాపల్లి మార్కెట్లోని వర్తకులను తిరుమల పిలిపించి సమీక్ష నిర్వహించారు. వారి సూచనల ప్రకారం పది రోజుల క్రితం మార్కెట్ యార్డులోని లక్ష్మీగణపతి ట్రేడింగ్ కంపెనీ నుంచి ఒకటో రకం బెల్లం 21 టన్నులు తిరుమలకు తరలించారు.








