ఏపీలో అమిత్ షా పర్యటన
ఆంధ్రప్రదేశ్లో బీజేపీని మరింత క్రియాశీలం చేయాలన్న యోచనలో ఉన్న ఆ పార్టీ అధ్యక్షుడు అమిత్ షా త్వరలో రాష్ట్ర పర్యటన చేపట్టనున్నారు. ఈ నెల 28న ప్రారంభంకానున్న ఆయన పర్యటన మూడు రోజుల పాటు కొనసాగనుంది. విజయవాడతో పాటు రాష్ట్రంలోని మరికొన్ని ప్రాంతాల్లో పర్యటించనున్నారు. స్థానిక యంత్రాంగాన్ని పునరుత్తేజపరచడం ద్వారా పార్టీని మరింత విస్తరించాలనే భావనలో షా ఉన్నారని ఏపీ బీజేపీ నేత ఒకరు వెల్లడించారు. రాష్ట్ర పర్యటనకు ముందు అమిత్ షా ఆగస్టు 22 నుంచి 3 రోజులపాటు తమిళనాడులో పర్యటించనున్నారు.








