అమిత్ షాకు సీఎం చంద్రబాబు విందు
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నివాసంలో విందు భేటీ ముగిసింది. బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా కు చంద్రబాబు తన నివాసంలో విందు ఇచ్చారు. ఈ విందు భేటీలో రాష్ట్రపతి ఎన్నిక, రాష్ట్రంలో ఇరు పార్టీల బలోపేతం, తాజా రాజకీయ పరిణామాలపై చర్చించారు. ఈ విందు భేటీ దాదాపు గంట సేపు జరిగింది. కేంద్ర మంత్రులు వెంకయ్యనాయుడు, సురేష్ ప్రభు, సుజనా చౌదరి, రాష్ట్ర మంత్రులు యనమల రామకృష్ణుడు, కళా వెంకటరావు, నారా లోకేష్ తదితరులు పాల్గొన్నారు.








