అమరావతి నిర్మాణానికి సహకరిస్తాం
ఆంధ్రప్రదేశ్ నూతన రాజధాని అమరావతి నిర్మాణానికి అవసరమైన సూచనలు, సలహాలను అందిస్తామని సింగపూర్‌కు చెందిన సెంటర్ ఫర్ లివబుల్ సిటీస్ సంస్థ ప్రతినిధులు వెల్లడించారు. ఆ సంస్థ కార్యనిర్వాహక సంచాలకుడు ఖూ టెంగ్ చ్యే ఆధ్వర్యంలో ప్రతినిధులు విజయవాడలో అమరావతి అభివృద్ధి సంస్థ (ఏడీసీ) అధికారులతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా కొండవీటి వాగు వరద ముంపు నివారణకు తీసుకుంటున్న చర్యలపై చర్చ జరగ్గా, సింగపూర్ నిర్మాణ సమయంలో వరద నివారణకు తీసుకున్న చర్యలను సంస్థ ప్రతినిధులు వివరించారు.








