ఒలింపిక్స్‌కు వేదికగా అమరావతి!
భారతదేశంలో ఒలింపిక్స్స్థాయి క్రీడల పోటీల నిర్వహణకు అనుగుణమైన మౌలిక సదుపాయాలు ఇంతవరకు ఎక్కడ లేవు. తొలి సారిగా అమరావతిలోని క్రీడానగరంలో ఆ స్థాయి మౌలిక సదుపాయాలను కల్పించడంతో పాటు ఇక్కడే ఒలింపిక్స్‌ను నిర్వహించి ఆంధ్రప్రదేశ్ సత్తా ప్రపంచానికి చాటుతామని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రకటించారు. 2019–20లో జరిగే కామన్వెల్త్ క్రీడాలను కూడా ఇక్కడే నిర్వహించేందుకు ప్రయత్నాలు చేస్తామన్నారు. అమరావతి నగర పరిధిలోని 7 ప్రధాన రహాదారుల నిర్మాణానికి ముఖ్యమంత్రి ఉగాది రోజున శంకుస్థాపన చేశారు. సుమారు 915 కోట్ల వ్యయంతో ఈ రహాదారులు నిర్మిస్తారు. ఇవి పూర్తయితే నగరంలోని ప్రధాన ప్రాంతాలన్నింటికి మర్గాలు అందుబాటులోకి వస్తాయి. అలాగే 5 జాతీయ, 9 రాష్ట్ర స్థాయి రహాదారులతో ఇవి అనుసంధానమౌతాయని చంద్రబాబు ఈ సందర్భంగా చెప్పారు. అమరావతి నగరంలో ప్రపంచ స్థాయి పౌర సదుపాయలను కల్పిస్తున్నామన్నారు. చారిత్రాత్మక వారసత్వ సంపదను భవిష్యత్తు తరాలకు అందిస్తూనే అత్యాధునిక సాంకేతిక నైపుణ్యాన్ని ఇక్కడ వినియోగిస్తున్మాన్నారు.







