42 ఐటీ కంపెనీలకు స్థలాల కేటాయింపు
రాష్ట్రంలో 18,000 ఉద్యోగాలు ఇచ్చే 42 ఐటీ కంపెనీలకు ఆఫీసు స్థలం.. భూములు కేటాయించాలని సెంట్రల్ కమిటీ ఫర్ ఐటీ ఇన్వె్‌స్టమెంట్ నిర్ణయించింది. సచివాలయంలో మంగళవారం సమావేశమైన ఏపీఎన్ఆర్టీ చైర్మన్ రవికుమార్, సీఈవో కె.సాంబశివరావు రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు ముందుకువచ్చిన ఐటీ కంపెనీలు, ఉద్యోగాల కల్పన తదితర అంశాలను సమీక్షించారు. మొత్తం 42 ఐటీ కంపెనీలకు కార్యాలయ స్థలాలు ఇవ్వాలని నిర్ణయించారు.








