జేసీ దివాకర్ రెడ్డికి లైన్ క్లియర్
తెలుగుదేశం పార్టీ పార్లమెంటు సభ్యుడు (ఎంపీ) జేసీ దివాకర్‌రెడ్డికి వూరట లభించింది. ఆయన విమాన ప్రయాణంపై నిషేధం ఎత్తివేస్తున్నట్టు ఎయిర్‌లైన్స్ సంస్థలు ప్రకటించాయి. గత నెలలో విశాఖపట్టణం ఎయిర్ పోర్టు సిబ్బందిపై అనంతపురం ఎంపీ దివాకర్‌రెడ్డి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన విషయం తెలిసిందే. తమ సిబ్బందిపై ఎంపీ అనుసరించిన తీరును తప్పుపట్టిన దేశీయ విమానయాన సంస్థలు ఇండిగో, ఎయిరిండియా, స్పైస్‌జెట్, జెట్ ఎయిర్వేస్, గో ఎయిర్ తదితర సంస్థలు ఆయనపై నిషేధం విధించాయి. తన ప్రయాణంపై ఆయా సంస్థల నిషేధాన్ని సవాల్ చేస్తూ ఆయన హైకోర్టులో వ్యాజ్యం దాఖలు చేశారు. ఇదిలా ఉండగా ఈ రోజు ఆయనపై నిషేధం ఎత్తివేస్తున్నట్టు ఆయా విమానయాన సంస్థలు ప్రకటించడం విశేషం.








