విశాఖలో 3వ ప్రపంచ విపత్తుల నిర్వహణ సదస్సు
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, గీతం యూనివర్శిటీ, డిజాస్టర్ మేనేజ్మెంట్ కన్వర్జెన్స్ సొసైటీ ఆధ్వర్యంలో విశాఖపట్నంలో 3వ ప్రపంచ విపత్తుల సదస్సు నిర్వహించనున్నారు. నవంబరు 6 నుంచి 10వ తేదీ వరకు నిర్వహించనున్న ఈ సదస్సుకు సంబంధించిన పోస్టర్‌ను ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో ఉప ముఖ్యమంత్రి నిమ్మకాయల చినరాజప్ప, మానవ వనరుల శాఖ మంత్రి గంటా శ్రీనివాసరావు, పార్లమెంట్ సభ్యులు ముత్తంశెట్టి శ్రీనివాసరావు, జిల్లా కలెక్టర్ ప్రవీణ్‌కుమార్, డీఎంఐసీఎస్ అధ్యక్షులు డాక్టర్ ఎస్.ఆనందబాబు, గీతం యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ ఎం.ఎస్.ప్రసాధరావు తదితరులు పాల్గొన్నారు.








