రాఘవేంద్రస్వామి మఠంలో 346వ ఆరాధనోత్సవాలు
కర్నూలు జిల్లా మంత్రాలయం రాఘవేంద్రస్వామి మఠంలో 346వ ఆరాధనోత్సవాలు ఆదివారం ఘనంగా ప్రారంభమయ్యాయి. పీఠాధిపతి సుభుదేంద్రతీర్థులు స్వామివారి బృందావనానికి, మూలరాముల వారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. సాయంత్రం ధ్వజారోహణ, గోపూజ, లక్ష్మీపూజ, ఽధాన్యపూజ, అశ్వపూజ నిర్వహించారు. యోగీంద్ర కళాపంటపంలో జ్యోతి ప్రజ్వలన చేసి ఉత్సవాలు ప్రారంభించారు.








