హిందూసేన ఆధ్వర్యంలో డొనాల్డ్ ట్రంప్ బర్త్ డే వేడుకలు
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ బర్త్‌డే వేడుకలు ఢిల్లీలో రాజ్‌తిలక్ సెర్మనీ పేరుతో అట్టహాసంగా జరుగనున్నాయి. ట్రంప్‌ను మానవత పరిరక్షకుడు గా అభివర్ణిస్తూ హిందూసేన ఆధ్వర్యంలో ఈ వేడుక జరుగనుంది. ఈ సంస్థ గత ఏడాది కూడా ట్రంప్ బర్త్‌డే వేడుక నిర్వహించింది. ట్రంప్ 71వ వసంతంలోకి అడుగుపెడతారు. ఇందుకోసం జంతర్‌మంతర్ వద్ద హిందూసేన తలపెట్టిన వేడుకలో ట్రంప్ ఫోటో ఎగ్జిబిషన్ కూడా ఏర్పాటు చేస్తున్నారు. ట్రంప్ చిన్నప్పటి ఫోటో, ప్రస్తుత ఫోటోతో బెల్లూను అలంకరించిన పోస్టర్‌ను నిర్వాహకులు వాట్సాప్, ఇతర సోషల్ మీడియాలో షేర్ చేస్తూ, బర్త్‌డే వేడుకల్లో పాల్గొనాలని ఆహ్వానించారు.













