నవంబరు 2 నుంచి జగన్ పాదయాత్ర?
వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు జగన్ మోహన్ రెడ్డి తలపెట్టిన పాదయాత్ర నవంబరు 2వ తేదీ నుంచి ప్రారంభమయ్యే అవకాశం ఉంది. ఈ మేరకు జగన్ నిర్ణయించినట్టు సమాచారం. అంతకుముందు అక్టోబరు 27 నుంచి పాదయాత్ర ప్రారంభించాలని నిర్ణయించారు. ఒకటి రెండ్రోజుల్లో కొత్త తేదీని ఖరారు చేయనున్నారు. ఆ లోగా తిరుమలకు వెళ్లి తిరుమలేశుని జగన్ దర్శించుకుని వస్తారు.








