పెళ్లిపీటలెక్కనున్న శ్రియ?
దాదాపు పదేళ్లకు పైగా చిత్రపరిశ్రమలో రాణిస్తున్న నటి శ్రియ. ఇష్టం సినిమాతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన శ్రియ దాదాపు అగ్రకథానాయకులందరితో నటించారు. త్వరగా పెళ్లి చేసుకోవాలంటూ తల్లిదండ్రులు ఒత్తిడికి గురిచేస్తుండడంతో అమె వివాహానికి ఒప్పుకున్నట్లు తెలుస్తోంది. అయితే శ్రియ ఇక పెళ్లిపీటలెక్కబోతున్నట్లు టాలీవుడ్ వర్గాల సమాచారం. ఓ ఇంటర్వ్యూలో ఎప్పుడుపెళ్లి చేసుకుంటారు అని మీడియా అడిగిన ప్రశ్నకు, త్వరలోనే చేసుకుంటానని వివాహానికి సంబంధించిన విషయాలు తానే స్వయంగా వెల్లడిస్తానని పేర్కొన్నారట.








