నడకతో సంతోషం
అడుగుతీసి అడుగు ముందుకేస్తే చాలు. మనసులో సంతోషం వికసిస్తుంది అంటున్నారు లోవా వర్సిటీ మానసిక పండితులు. ఆహారం కోసం మనిషి నడవడం నేర్చుకుని, ఆకలి తీర్చుకున్నప్పుడే నడకను ఆస్వాదించడం నేర్చుకున్నాడన్నది వారి విశ్లేషణ. పరిశోధనలో భాగంగా కొందరు విద్యార్థులను కళాశాలలో ఇష్టం వచ్చినచోట తిరిగి రమ్మన్నారు. మరో బృందాన్ని హాలులో కూర్చుని చిత్రాలను తిలకించమన్నారు. అనంతరం రెండు బృందాలను ఓ చోట కూర్చోబెట్టి పది నిమిషాల పాటు వీడియోలు చూపించారు. తర్వాత వారి భావోద్వేగాలను నమోదు చేయగా, కూర్చున్నవారి కంటే నడిచినవారే చాలా ఆనందంగా ఉన్నట్లు వెల్లడైందని పరిశోధకులు జాఫ్రీ మిల్లర, లతాన్ క్రిజన్లు తెలిపారు.








