విశాఖ టూ కొలంబోకు విమాన సర్వీసులు ప్రారంభం
విశాఖ ఎయిర్ పోర్టు నుంచి కొలంబోకు విమాన సర్వీసులను కేంద్ర విమానయాన శాఖ మంత్రి అశోక్ గజపతిరాజు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విశాఖ -శ్రీలంక సర్వీస్ ప్రారంభించడం ఆనందం కలిగించిందని అన్నారు. అంతర్జాతీయ విమాన సర్వీసులు వల్ల పర్యాటక రంగానికి ఊతమిచ్చినట్లవుతుందని అన్నారు. విశాఖ నుంచి కొలంబోకు వారానికి నాలుగు సర్వీసులు నడుపుతామన్నారు. అంతర్జాతీయంగా కనెక్టివిటీ పెరిగితే యువతకు ఉద్యోగ అవకాశాలు మెండుగా ఉంటాయని మంత్రి అఖిల ప్రియ అన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీ హరిబాబు, మంత్రులు అయ్యన్నపాత్రుడు, భూమా అఖిలప్రియ తదితరులు పాల్గొన్నారు.








