అమెరికాలో కాల్పుల కలకలం
అమెరికాలోని ప్రముఖ పర్యాటక నగరం ఛార్లెస్టన్లో ఓ మాజీ ఉద్యోగి కాల్పులతో కలకలం సృష్టించాడు. గురువారం మధ్యాహ్నం సమయంలో ఒక రెస్టారెంటులోని వంటగదిలో నుంచి వచ్చిన వృద్దుడు కాల్పులు జరుపుతూ నగరంలోకి కొత్త బాస్ వచ్చాడంటూ బిగ్గరగా అరిచాడని ప్రత్యక్ష సాక్షులు పేర్కొన్నారు. కాల్పుల్లో ఒక పర్యాటకుడు గాయపడినట్లు తెలిసింది. ఆగంతకుడు పలువురు సందర్శకులను బంధించాడన్న వార్తల నేపథ్యంలో పోలీసులు ఘటనా స్థలం వద్ద మోహరించారు. బాంబు స్క్యాడ్ బృందాలను రంగంలోకి దించారు.








