కుంగుబాటును తగ్గించే జన్వువు గుర్తింపు
ప్రపంచవ్యాప్తంగా ఏటా లక్షలమంది బలి తీసుకుంటున్న కుంగుబాటుకు మెరుగైన చికిత్సలను అందుబాటులోకి తీసుకొచ్చే దిశగా శాస్త్రవేత్తలు ముందంజ వేశారు. ఒత్తిడి పెరుగదల, తగ్గుదలలో కీలక పాత్ర పోషిస్తున్న జన్యువును వారు గుర్తించారు. సాధారణంగా పసందైన వంటకాలను ఆరగించినప్పుడు, శృంగారంలో పాల్గొన్నప్పుడు, ఇతర ఆనందకర క్షణాల్లో ఉన్నప్పుడు మెదడులో న్యూక్లియస్ అకుంబెన్స్ (ఎన్ఏ) అనే భాగంలోని నాడీకణాలు ఉత్తేజితమవుతుంటాయి. కుంగుబాటు తలెత్తడంలో ఈ నాడీకణాల ప్రభావాన్ని గుర్తించేందుకుగాను అమెరికాలోని మేరీలాండ్ వైద్య విశ్వవిద్యాలయ పరిశోధకులు ఎలుకలపై విస్తృత అధ్యయనం నిర్వహించారు. ఎలుకల్లో ఒత్తిడి పెరిగినప్పుడు ఎన్ఏ లోని డీ2 నాడీకణాల్లో ఎస్ఎల్సీ6ఏ15 అనే జన్యువు స్థాయిలు బాగా తగ్గిపోతుండటాన్ని గుర్తించారు. అవే నాడీకణాల్లో ఎస్ఎల్సీ6ఏ15ల స్థాయిని పెంచినప్పుడు ఎలుకలు ఉల్లాసంగా మారినట్లు వారు వెల్లడించారు. తాజా అధయన ఫలితాల ఆధారంగా కుంగుబాటుకు మెరుగై, చికిత్సలను అభివృద్ధి చేయవచ్చునని అభిప్రాయపడ్డారు.








