శ్రీవారి బ్రహ్మూెత్సవాలకు ఘనంగా ఏర్పాట్లు
తిరుమల శ్రీవారి వార్షిక బ్రహ్మూెత్సవాలకు ఘనంగా ఏర్పాట్లు చేస్తున్నట్లు ఈవో అనిల్‌కుమార్ సింఘాల్ తెలిపారు. తిరుమల నుంచి డయల్ తితిదే ఈవోలో ఆయన మాట్లాడారు. బ్రహ్మూెత్సవాలు ఈ నెల 23 నుంచి అక్టోబర్ 1 వరకు నిర్వహించనున్నామన్నారు. ఉత్సవాల్లో ఎక్కువ మంది భక్తులకు శ్రీవారి మూలవిరాట్టు దర్శనం కల్పించడానికి వీలుగా స్వామివారి ఆర్జిత సేవలు, వయోవృద్ధులు, దివ్వాంగులు, చంటిబిడ్డలకు ప్రత్యేక దర్శనాలు రద్దు చేసినట్లు తెలిపారు.








