బ్రాతో రొమ్ము కేన్సర్ గుర్తింపు
మహిళలకు రొమ్ముకేన్సర్ ప్రమాదాన్ని చాలా ముందుగా గుర్తించి హెచ్చరించే బ్రాను రూపొందించాడు. అమెరికాకు చెందిన 18 ఏళ్ల కుర్రాడు. రొమ్ము కేన్సర్ వచ్చే లక్షణాలను ముందుగానే పసిగట్టేందుకు వీలుగా హ్యూస్టన్‌కు చెందిన జూలియన్ రియోస్ కంటూ 200 సెన్సర్లతో బ్రాను రూపొందించాడు. శరీర ఉష్ణోగ్రత, రొమ్ముల్లో తేడాలను ఈ బ్రా సమర్థంగా గుర్తించ గలదన్నారు. ఈ బ్రాను వారానికి ఒక గంట ధరిస్తే సరిపోతుందని, నిత్యం ధరించాల్సిన పని లేదన్నారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌తో రూపొందించిన ఈ బ్రా రక్తసరఫరా ఆధారంగా కేన్సర్ ప్రమాదాన్ని గుర్తిస్తుంది. దీనికోసం ఓ యాప్ కూడా ఉంది. కంటూ తల్లి రొమ్ము కేన్సర్‌తో బాధపడ్డారు. చివరకు ఆమె రొమ్ములను తొలగించాల్సి వచ్చింది. ఈ ఘటన కంటూపై తీవ్రంగా ప్రభావం చూపింది. తన తల్లిలాగా మరే మహిళా బాధపడకూడదని పరిశోధనలు చేసిన కంటూ ఈ బ్రాను రూపొందించాడు.













