పెళ్లిచేసుకోకుండానే పిల్లల్ని కనడానికి రెడీ
నటుడు కమల్‌హాసన్ కూతురుగా కంటే తన అందం, అభినయంతో తెలుగు, హిందీ, తమిళ చిత్ర పరిశ్రమలో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న హీరోయిన్ శృతి హసన్ ఈ మధ్య ఒక ఇంటర్వ్యూలో తన జ్ఞాపకాలు పంచుకుంది. కెరీయర్ ప్రారంభంలో తాను ఒక మ్యూజిక్ డైరెక్టర్ని ప్రేమించానని, అయితే తరువాత అతనిమీద తనకు వున్న ఫీలింగ్ ప్రేమ కాదని తెలిసిన తర్వాత అతనితో విడిపోయానని చెప్పింది. అయితే ప్రస్తుతం మాత్రం తాను ఎవరితో లవ్‌లో లేదని, ప్రేమించే టైం కూడా ఇప్పుడు తనకు లేదని తేల్చి చెప్పింది. అయితే ఎవరినైనా ప్రేమిస్తే తనని పెళ్లిచేసుకోకుండానే పిల్లల్ని కనడానికి తాను రెడీ అని, ఈ విషయంలో తనకు ఎలాంటి అభ్యంతరాలు లేవని తేల్చి చెప్పింది. ఎవరికీ అభ్యంతరాలు ఉన్నా తనకు అవసరం లేదని కూడా చెప్పేసింది. అయితే శృతిహాసన్ మనసు దోచిన ఆ మ్యూజిక్ డైరెక్టర్ ఎవరై ఉంటారా అని అందరూ తెలుసుకునే పనిలో ఉన్నారు.













