రష్యా గుర్తించిన మన తెలుగు తేజం
తెలుగు యువకుడి ప్రతిభను రష్యా గుర్తించింది. తమ దేశంలో డాక్యుమెంటరీ తీయడానికి ఆహ్వానించింది. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకున్న విశాఖపట్నం యువకుడు సాగి శ్రీహరిశర్మ 2018 ఫిఫా పుట్బాల్ ప్రపంచ పోటీలకు రష్యా చేస్తున్న ఏర్పాట్లను కళ్లకు కేట్టలా డాక్యుమెంటరీ తీసి ఆ దేశ అధికారుల ప్రశంసలు పొందాడు. డాక్యుమెంటరీ చిత్రాల రూపకల్పనకు రష్యా ఏటా ప్రపంచవ్యాప్తంగా ఔత్సాహికుల్ని ఆహ్వానిస్తుంది. ఈ ఏడాది 9న వి.జి.ఐ.కె. సమ్మర్ స్కూల్ పేరిట నిర్వహించిన పోటీకి 40 దేశాల నుంచి వందకు పైగా దరఖాస్తులు రాగా, రష్యా సాంస్కృతిక మంత్రిత్వశాఖ ఐదుగురినే ఎంపిక చేసింది. అందులో మన దేశం నుంచి శ్రీహరి ఒక్కడే ఎంపికయ్యాడు.













