రజనీకాంత్ ఫిట్‌గా ఉన్నారు : అమెరికా వైద్యులు
సూపర్‌స్టార్ రజనీకాంత్ ఇటీవల వైద్య పరీక్షల నిమిత్తం అమెరికాకు వెళ్లిన విషయం తెలిసిందే. అయితే, ఆయనను పరీక్షించిన వైద్యులు ఆయన ఆరోగ్యం బాగానే ఉందని, ఫిట్‌గానే ఉన్నారని ధ్రువీకరించినట్లు సమాచారం. అయితే, వచ్చే వారంలో రజనీ చైన్నెకు బయల్దేరే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. తన పెద్దకుమార్తె ఐశ్వర్యతో కలిసి అమెరికాకు వెళ్లిన రజనీ అక్కడ ఓ క్యాసినోలో ఉంటున్నారు. ఈ పర్యటనలో భాగంగా అక్కడ కారులో ప్రయాణిస్తూ తీసుకున్న ఓ సెల్ఫీ వీడియోను తొలిసారిగా తలైవా ఇటీవలే అభిమానులతో పంచుకున్నారు. అక్కడి నుంచి తిరిగి వచ్చాక తన రాజకీయ కార్యకలాపాలను వేగవంతం చేసే అవకాశం కన్పిస్తోంది. ఇప్పటికే రజనీ తన రాజకీయ అరంగేట్రంపై పలు వేదికల్లో చర్చించారు.








