టైర్లను ఎప్పుడు మార్చాలో చెప్పే సెన్సర్
సురక్షిత ప్రయాణంతోపాటు వాహన సామర్థ్యాన్ని పెంచే వినూత్న సెన్సర్ను శాస్త్రవేత్తలు అభివృద్ధి చేశారు. ఈ సెన్సర్లు టైర్లను మార్చాల్సిన సమయాన్ని గుర్తించి డ్రైవర్లను హెచ్చరిస్తాయట. టైర్లలోపల ప్రింట్చేసే ఈ సెన్సర్లను తక్కువ ఖర్చుతో తయారు చేశామని డ్యూక్ యూనివర్సిటీ శాస్త్రవేత్తలు వివరించారు. ఇవి అరుగుదలను, డామేజ్ను ఎప్పటికప్పుడు గమనిస్తూ ఉంటాయని, ఆరుగుదల ఓ పరిమితి దాటగానే ఈ సెన్సర్లు హెచ్చరికలను పంపిస్తాయని వివరించారు.








