అధిక ఉష్ణోగ్రతలు గర్భిణులకు ప్రమాదకరం
వాతావరణ మార్పుల వల్ల కలిగే అధిక ఉష్ణోగ్రతలు గర్భిణులకు, వారికి పుట్టబోయే బిడ్డలకు హానికరమని ఓ అధ్యయనం తెలిపింది. అధిక ఉష్ణోగ్రతల వల్ల ప్రసవ ఫలితాలపై ప్రభావం చూపుతుందని, బరువు, బిడ్డను కనే కాలంలో తేడాలు ఉండటం, ఒక్కో సారి బిడ్డమరణించడంతో పాటు, ప్రసవ సమయంలో ఒత్తిడి పెరగడం లాంటి ప్రతికూలతలు సంభవిస్తాయని అమెరికాలోని జార్జివాషింగ్టన్ విశ్వవిద్యాలయ పరిశోధకులు కనుగొన్నారు. గర్భందాల్చిన నాటి నుంచి సరైన జాగ్రత్తలు తీసుకోని వారికి అధిక ఉష్ణోగ్రతలు ప్రమాదకరమని అసోసియేట్ ప్రొఫెసర్ సబ్రీనా మెక్కార్మిక్ తెలిపారు.













