డల్లాస్ లో ఎన్టీఆర్ విగ్రహావిష్కరణ
విశ్వవిఖ్యాత నటసౌర్వభౌముడు, మాజీ ముఖ్యమంత్రి, తెదేపా వ్యవస్థాపకులు డా.నందమూరి తారాకరామారావు విగ్రహాన్ని ఆదివారం నాడు ఆయన జన్మదిన వేడుకల్లో భాగంగా డల్లాస్ ఎన్నారై తెదేపా శ్రేణులు ఆవిష్కరించారు. అనంతరం ఎన్టీఆర్ జన్మదిన వేడుకలు నిర్వహించారు. ఈ విగ్రహాన్ని భారతదేశంలో ప్రత్యేకంగా రూపొందించి అమెరికాకు తరలించారు. ఈ కార్యక్రమంలో గోవాడ అజయ్, కొరడా కృష్ణ, కిషోర్ చలసాని, అమర్ అన్నే, సురేష్ మండువ, తాతినేని రాం తదితరులు పాల్గొన్నారు.








