బయ్యారంలో అమెరికా ఎన్నారై సుధాకర్ మృతి
స్వరాష్ట్రంలో జరిగే శుభకార్యం నిమిత్తం వచ్చిన అమెరికా గ్రీన్ కార్డు హోల్డర్ ఒకరు గుండెపోటుతో మృతి చెందాడు. సోమవారం రాత్రి బయ్యారంలో జరిగే గృహ ప్రవేశానికి వచ్చిన ఎన్నారై సుధాకర్ అనారోగ్యానికి గురై మరణించారు. షిర్డీ సాయిబాబా ఆలయ నిర్మాణ ధర్మకర్త పెద్ది శేషగిరిరావు, విజయనిర్మల కుమారుడు సూధాకర్ (52) 20 ఏళ్లుగా అమెరికాలోనే సిర్థపడిపోయి, ఆ దేశపు గ్రీన్‌కార్డు పొందాడు. ఈ క్రమంలోనే తన తండ్రి కట్టించిన నూతన గృహ ప్రవేశ నిమిత్తం నాలుగు రోజుల క్రితం కుటుంబ సభ్యులతో కలిసి వచ్చాడు. సోమవారం రాత్రి అస్వస్థతకు గురయ్యాడు. దగ్గర్లోని వైద్యులను సంప్రదించగా, అప్పటికే సుధాకర్ మరణించినట్లుగా వైద్యులు ధ్రువీకరించినట్లు కుటుంబ సభ్యులు పేర్కొన్నారు. ఆయనకు భార్య ఇద్దరు పిల్లలున్నారు.








