ఆయన రాకతో మాకు ఇబ్బంది లేదు
తెలుగుదేశం పార్టీలోకి గంగుల ప్రతాప్‌రెడ్డి రాకతో తమకు ఇబ్బందిలేదని మంత్రి అఖిలప్రియా అన్నారు. నంద్యాల ప్రచారంలో ఉన్న అమె మీడియతో మాట్లాడుతూ నంద్యాల, ఆళ్లగడ్డలో భూమా వర్గం బలంగా ఉందని అన్నారు. భూమా బ్రహ్మానందరెడ్డి గెలుపు కోసం గంగుల ప్రతాప్‌రెడ్డి కృషి చేస్తారని అనుకోవడం లేదని అన్నారు. వైసీపీ ఎమ్మెల్యే రోజా వ్యక్తిగత విమర్శల కంటే నంద్యాల అభివృద్ధిపై మాట్లాడాలని సూచించారు.








