మనతో మనం మాట్లాడుకుంటే ఒత్తిడి దూరం!
మనతో మనం మాట్లాడుకుంటే పిచ్చోళ్లని అంటారు. కానీ, అలా మాట్లాడుకుంటే ఒత్తిడి దూరం అవుతుందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. మనల్నే ఎదుటి వ్యక్తిగా ఊహించుకొని మాట్లాడుకోవటం వల్ల మొదడుకు ఒత్తిడి నుంచి ఉపశమనం కలుగుతుందని అమెరికాలోని మిచిగాన్ స్టేట్ యూనివర్సిటీ పరిశోధకులు వెల్లడించారు. భావోద్వేగాలు నియంత్రణలో ఉండి ఆందోళనలు, మానసిక వ్యాధుల నుంచి రక్షించుకోవచ్చని తెలిపారు.








