అమెరికాలో ఐటీకి భలే డిమాండ్
అమెరికాలో ఐటీ ఉద్యోగులకు భలే డిమాండ్ ఏర్పడనుంది. ప్రపంచంలో డాటా సైన్స్ ఉన్నన్ని రోజులు సాఫ్ట్వేర్ రంగం ఎటువంటి ఇబ్బందులు ఎదుర్కొదని ఇటీవల ఓ అధ్యయనంలో వెల్లడైంది. అయితే, మార్కెట్ అవసరాలకు అనుగుణంగా నూతన సాంకేతిక నైపుణ్యాలను అందుకోవాలని సూచించింది. కొత్త కోర్సులు నేర్చుకున్న యువతకు ఎటువంటి ఇబ్బందులు ఉండవని ఉడసిటీ అనే ఆన్లైన్ కంపెనీ తెలిపింది. ఈ విషయం తమ సర్వేలో తేలినట్లు చెప్పింది. 2018 వరకు దాదాపు లక్షా 40వేల నుంచి 1 లక్షా 90 వేల ఐటీ నిపుణుల కొరత ఉంటుందని తెలిపింది. 2014 నుంచి డాటా సైంటిస్ట్ నిపుణుల అవసరం ఏర్పడుతుందని వెల్లడించారు. నౌకరీ, డైస్ వంటి జాబ్ పోర్టల్స్‌లో ఆయా జాబ్‌ల కోసం కంపెనీల మానవ వనరుల నిపుణులు వెతుకుతున్నట్లు పేర్కొంది. ప్రస్తుతం బిగ్ డాటాలో ఎక్కువ ఉపాధి అవకాశాలున్నాయని నాస్కామ్ కూడా తెలిపినట్లు వివరించింది.ఆర్టిఫిషియల్ ఇంటలిజెన్స్‌లో కూడా మరింత అవసరం ఏర్పడనుందని వెల్లడించింది.








