అక్కడ నటించే ఉద్దేశం లేదు
కన్నడ చిత్ర పరిశ్రమలో నటించే ఉద్దేశం తనకు లేదని కథానాయిక శ్రుతిహాసన్ అన్నారు. కన్నడ హీరో ధ్రువ సర్జ కథానాయకుడిగా ఓ చిత్రం తెరకెక్కుతోంది. నంద కిశోర్ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. కాగా ఇందులో కథానాయిక పాత్ర కోసం దర్శక, నిర్మాతలు శ్రుతిని సంప్రదించారని వదంతులు వచ్చాయి. దాదాపు ఆమె చిత్రంలో నటించే అవకాశాలు ఉన్నట్లు చెప్పుకొచ్చారు. కాగా ఈ వార్తలను శ్రుతి ట్విటర్ వేదికగా ఖండించారు. ఇప్పుడు భవిష్యత్తులో కన్నడ చిత్రంలో నటించే ఉద్దేం లేదు. కన్నడ చిత్రంలో నటించమని ఎవరూ నన్ను సంప్రదించలేదు. ఇది కేవలం వదంతు మాత్రమే అని ట్వీట్ చేశారు.













