హైదరాబాద్ అబ్బాయి.. అమెరికా అమ్మాయి ఒకటయ్యారు
మనుసులు కలిసిన హైదరాబాద్ అబ్బాయి, అమెరికా అమ్మాయి మూడు మూళ్ల బంధంతో ఒకటయ్యారు. పంజాబ్‌కు చెందిన కెప్టెన్ దేవరాజ్, మధు దంపతుల కుమారుడు పునీత్‌కుమార్(29) నగరంలో సాప్ట్వేర్ ఇంజినీర్‌గా పనిచేస్తున్నారు. వీరి కుటుంబం సనత్‌నగర్‌లో స్ధిరపడింది. పునీత్ అమెరికాలో పనిచేస్తున్న సమయంలో హోటల్ మేనేజ్మెంట్ చేసి మేనేజర్‌గా పనిచేస్తున్న ఆస్లీ బ్రూక్రీహెల్మ్(28)తో ఏర్పడిన పరిచయం ప్రేమగా మారింది. హైకోర్టు న్యాయవాది శరత్చంద్ర సహకారంతో సుచిత్రాచౌరస్తా సమీప గోదావరి హోమ్స్ కాలనీలోని వేంకటేశ్వరస్వామి దేవాలయంలో హిందూ ధర్మశాస్త్రం ప్రకారం వివాహం చేసుకున్నారు.








